ASR: చింతపల్లి మండలం లోతుగెడ్డ బ్రిడ్జి వద్ద రూ.11.95లక్షల విలువైన 23.9 కిలోల గంజాయి పట్టుబడిందని అన్నవరం ఎస్సై సాయిరామ్ ఇవాళ తెలిపారు. తమ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా, 2 పల్సర్ బైక్‌లపై తరలిస్తున్న గంజాయి పట్టుబడిందని చెప్పారు. ఈమేరకు, గంజాయితో పాటు వాహనాలను స్వాధీనం చేసుకుని, గంజాయి తరలిస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు.
ఆంధ్రప్రదేశ్
చింతపల్లిలో గంజాయి పట్టివేత


