హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు అమలాపురంలో జాబ్ మేళా

కోనసీమ: అమలాపురంలోని జిల్లా ఉపాధి కార్యాలయం వద్ద గురువారం ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారి ఆర్. వహీద తెలిపారు. ఎస్ఎస్సీ, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లమా ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. వివరాల కోసం 8978905032 నంబరును సంప్రదించాలని ఆమె సూచించారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.