హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బెల్ట్ షాప్‌పై దాడి.. 44 మద్యం సీసాలు సీజ్!

PLD: పల్నాడు జిల్లా ఎస్పీ ఆదేశాలతో సత్తెనపల్లి డీఎస్పీ బలిజేపల్లి గ్రామంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అక్రమంగా నడుస్తున్న బెల్ట్ షాప్‌పై దాడి చేసి 44 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. అక్రమ విక్రయాలపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. చట్టాన్ని అతిక్రమిస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేశారు.