హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భక్తుల సంతృప్తి సర్వే.. అన్నవరంకు నాలుగో స్థానం

కాకినాడ: ఇటీవల భక్తుల సౌకర్యాలపై చేపట్టిన EPRS సర్వేలో అన్నవరం దేవస్థానం నాలుగో స్థానంలో నిలిచింది. అన్నవరం 66.6 శాతం మంది సంతృప్తితో ఈ స్థానం దక్కించుకుంది. విజయవాడ 72.4 శాతంతో తొలి స్థానంలో నిలిచింది. ద్వారకా తిరుమల 71.9 శాతంతో రెండో స్థానం, సింహాచలం 68.1 శాతంతో మూడో స్థానంలో నిలిచాయి. దర్శనం, పారిశుధ్యం, ప్రసాదం పై భక్తుల అభిప్రాయాలు సేకరించారు.