CTR: 'సురక్షిత చిత్తూరు- మీ భద్రత మా బాధ్యత' కార్యక్రమంలో భాగంగా చిత్తూరు 1 టౌన్ పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఎస్ఐ నాగప్ప నాయక్ ఆధ్వర్యంలో గాంధీ కూడలి నుంచి చర్చి వీధి వరకు పెట్రోలింగ్ చేపట్టి ప్రజలకు భద్రత, సైబర్ నేరాలు, మహిళలు-చిన్నారుల రక్షణ, రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 112కు సమాచారం ఇవ్వాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
సురక్షిత చిత్తూరు కోసం ఫుట్ పెట్రోలింగ్


