భూపాలపల్లి జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ఈ నెల 9న పుష్ప గార్డెన్స్‌లో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తెలిపారు. గురువారం అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. పలు కంపెనీలు పాల్గొనే ఈ మేళాను యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు.గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే వారికి ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తున్నట్లు వెల్లడించారు.
తెలంగాణ
VIDEO: మెగా జాబ్ మేళా ఏర్పాట్లు పరిశీలించిన MLA


