హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేరూరు ఎస్సైగా అశోక్

MLG: వాజేడు మండలంలోని పేరూరు ఎస్సైగా రేక అశోక్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఎస్సైగా పనిచేసిన గుర్రం కృష్ణప్రసాద్ వీఆర్‌కు బదిలీ కావడంతో ఆయన స్థానంలో ఆసిఫాబాద్‌లో వీఆర్‌లో ఉన్న అశోక్‌ను నియమించారు. బాధ్యతలు చేపట్టిన అశోక్‌ను పోలీసు సిబ్బంది అభినందించారు. బదిలీపై వెళ్తున్న కృష్ణప్రసాద్‌ను తుడుందెబ్బ నాయకులు సన్మానించి వీడ్కోలు పలికారు.