CTR: చౌక దుకాణాలకు సరఫరా చేసే బియ్యం బస్తాల తూకంలో ఎలాంటి తేడాలు లేకుండా చూడాలని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం పూతలపట్టు మండల కేంద్రంలోని బియ్యం గోడౌన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి బియ్యం నాణ్యత, బస్తాల తూకాన్ని పరిశీలించారు. అనంతరం రికార్డులను తనిఖీ చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఉదయ్ సతీశ్, డీటీలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
బియ్యం తూకాల్లో తేడా రాకూడదు: JC


