హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మలుపులు.. తుప్పలు.. ప్రయాణికులకు అవస్థలు

VZM: గంట్యాడ మండలం బుడతనాపల్లి మీదుగా రాచకిండాం, కొండకిండాం, ఒంపల్లి గ్రామాలకు వెళ్లే రహదారి ప్రమాదకరంగా మారింది. పలు మలుపుల వద్ద తుప్పలు పెరిగి రోడ్డులో సగభాగాన్ని ఆక్రమించడంతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.