హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నెల్లూరులో రైలు కిందపడి వ్యక్తి మృతి

నెల్లూరు సౌత్ రైల్వే స్టేషన్ సమీపంలో సుమారుగా 55 సంవత్సరాల గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడు బూడిద రంగుపై తెల్లని నిలువు గీతలు ఉన్న ఫుల్ హాండ్స్ షర్ట్, నలుపు రంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుడిని గుర్తించేందుకు ఎలాంటి ఆనవాళ్లు లభించలేదన్నారు. స్టేషన్ మాస్టర్ ఫిర్యాదు మేరకు జీ‌ఆర్‌పీఎస్ఐ హరి చందన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.