WGL: భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఇవాళ ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున అర్చకులు అమ్మవారికి అభిషేకాలు, వివిధ పూజా కార్యక్రమాలు చేపట్టి అనంతరం నూతన వస్త్రాలతో అలంకరించారు. అమ్మవారి దర్శనం కోసం సుదూర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల రాకతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.
తెలంగాణ
భద్రకాళి అమ్మవారి నేటి దివ్య దర్శనం


