హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'శిశువును కాపాడేందుకు అన్ని చర్యలు తీసుకున్నాం'

సవర భారతి 2 నెలల శిశువుని కాపాడేందుకు సాధ్యమైనంత ఉత్తమ వైద్య సేవలు అందించామని డి. ఎం.హెచ్.ఓ డా. పి.విజయలక్ష్మి తెలిపారు. ఈనెల 7న, ఓ పత్రికలో ప్రచురించిన ఏజెన్సీ చిన్నారులపై మృత్యు పంజా వార్తను ఖండిస్తూ నిన్న ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. జిల్లాలోని దోనుబాయి పింహెచ్.సి పరిధిలో జన్మించిన శిశువుకు అన్ని ప్రక్రియలు క్రమం తప్పకుండా పూర్తయ్యయన్నారు.