హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గ్రామాల్లో పడకేసిన పారిశుద్ధ్యం!

NLR: గ్రామాల్లో ప్రత్యేకాధికారుల పాలన రావడంతో పారిశుద్ధ్యం పడకేస్తోంది. జీతాలు రాక సిబ్బంది పనులు చేసేందుకు ఆసక్తి చూపడం లేదు. అటు స్వర్ణ పంచాయతీ యాప్‌తో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వారు ఆవేదన చెందుతున్నారు. దీంతో గ్రామాల్లో కాలువల పూడిక తీత, ఇంటింటా చెత్త సేకరణ నిలిచిపోయింది. ఇప్పటికైనా అధికారులు చొరవ తీసుకుని తమ సమస్యను పరిష్కరించాలని వారు కోరుతున్నారు.