హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు 27 మద్యం దుకాణాలకు లక్కీ డ్రా

కడప జిల్లాలోని 60 మద్యం దుకాణాలకు టెండర్లు ఆహ్వానించగా 27 దుకాణాలకు దరఖాస్తులు వచ్చాయి. వీటికి గురువారం ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ PGRS హాలులో లక్కీ డ్రా నిర్వహించనున్నారు. ఎంపికైన విజేతలకు A4 షాపు నిబంధనలు–2024 ప్రకారం మద్యం దుకాణాల లైసెన్సులు జారీ చేయనున్నట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారి తెలిపారు.