వరంగల్-హనుమకొండ ప్రాంతంలో అర్హత లేకుండా అల్లోపతి వైద్యం చేస్తున్న ముగ్గురు నకిలీ వైద్యులపై తెలంగాణ మెడికల్ కౌన్సిల్ (టీజీఎంసీ) ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయించింది. విజిలెన్స్ బృందం తనిఖీల్లో ఎంబీబీఎస్ అర్హత లేకుండానే వైద్యం చేస్తున్నట్లు గుర్తించింది. ఫోర్ట్ వరంగల్‌కు చెందిన గుర్రపు రామకృష్ణ, కాజీపేటకు చెందిన ఏ. కుమారస్వామి తదితరులపై కేసులు నమోదయ్యాయి. అర్హత లేని వ్యక్తుల వద్ద వైద్యం చేయించుకోవద్దని టీజీఎంసీ ప్రజలకు సూచించింది.
తెలంగాణ
నకిలీ డాక్టర్లు అరెస్ట్


