హైదరాబాద్: 28°C
తెలంగాణ

యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శిగా విజయుడు

NGKL: యువజన కాంగ్రెస్ మహబూబ్ నగర్ జిల్లా కార్యదర్శిగా ఊర్కొండకు చెందిన కంఠం విజయుడు నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అందజేశారు. విజయుడు మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన మందారం మాజీ సర్పంచ్ ద్యాప నిఖిల్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.