హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేబుల్ వైర్లు చోరీ ముఠా అరెస్ట్

JN: రఘునాథపల్లి మండలంలోని వ్యవసాయ బావులు, బోర్ల వద్ద కేబుల్‌ వైర్లు దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులు గంట రాజు, శీలం మహేష్‌, మద్దెల శ్రీను, ఏపీకి చెందిన కావడి సంజీవరాజు కలిసి చోరీలకు పాల్పడుతున్నట్లు SI నరేష్‌ తెలిపారు. వారి నుంచి రెండు బైకులు, 25 కిలోల కాపర్‌ వైర్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు.