హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అల్లూరులో పెరగనున్న వార్డులు!

నెల్లూరు: అల్లూరు నగర పంచాయతీకి ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇందుకు సంబంధించి వార్డులు ఏర్పాటులో నిమగ్నమయ్యారు. గతంలో 20 వార్డులు ఉండగా ఈసారి ఆ సంఖ్య 23కు పెరగనున్నట్లు ఓ అధికారి తెలిపారు. అల్లూరు పంచాయతీ పరిధిలో 40 వేల జనాభా ఉండగా 28 వేల మంది ఓటర్లు ఉన్నారు. కాగా ఇక్కడ తొలిసారి ఎన్నికలు జరగనుండడంతో రిజర్వేషన్లపై ఉత్కంఠ నెలకొంది.