హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటర్, ఆపై చదివిన వారికి గుడ్ న్యూస్

ఏలూరు జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈ నెల 9న జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు జిల్లా ఇన్‌ఛార్జ్ ఉపాధి అధికారి వరలక్ష్మి ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు జరిగే డ్రైవ్‌లో స్పారో సొల్యూషన్స్ సంస్థ టెలీ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు మహిళలను ఎంపిక చేయనుంది. ఇంటర్, ఆపై చదివిన 19-30 ఏళ్ల వారు అర్హులు. వేతనం రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు ఉంటుందన్నారు.