హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీటి సంపులో పడి మహిళ మృతి

CTR: నీటి సంపులో పడి మహిళ మృతి చెందిన ఘటన గంగవరంలో జరిగింది. MRC కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న ప్రకాశ్ తన భార్య మాధవితో కలిసి గంగవరంలో నివసిస్తున్నాడు.ఆమె నీటి సంపులో పడి ఉండగా గ్యాస్ డెలివరీ బాయ్ గుర్తించి సమాచారం ఇచ్చాడు. స్థానికులు ఆమెను వెలికి తీసి పలమనేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.