హైదరాబాద్: 28°C
తెలంగాణ

చుక్కాపూర్ ఆలయ హుండీ లెక్కింపు

KMR: చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మూడు నెలలకు సంబంధించిన హుండీలను బుధవారం సాయంత్రం లెక్కించారు. దేవదాయ శాఖ సహాయ కమిషనర్ విజయ రామారావు పర్యవేక్షణలో జరిగిన ఈ లెక్కింపులో మొత్తం రూ.5,33,681 ఆదాయం సమకూరినట్లు ఈవో శ్రీరాం రవీందర్ గుప్తా తెలిపారు. ఇందులో నోట్ల రూపంలో రూ.4,49,770, నాణేల రూపంలో రూ.83,911 వచ్చినట్లు ఆయన వెల్లడించారు.