JN: కాజీపేట నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న గూడ్స్ రైలు బుధవారం జనగామ రైల్వేస్టేషన్‌లో ఆగిన సమయంలో గార్డుగా విధులు నిర్వహిస్తున్న టి. మాధవిని పాము కాటేసింది. టిఫిన్ కోసం రైలు దిగి ప్లాట్‌ఫాం వైపు వస్తుండగా పట్టాలపై ఉన్న పాము కాటు వేసింది. వెంటనే జీఆర్పీ వెంకన్న, పోలీసులు ఆమెను జనగామ జిల్లా ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
తెలంగాణ
రైల్వే ఉద్యోగికి పాముకాటు


