HYD: జూబ్లీహిల్స్ రోడ్ నం.45లో నీటిని అనవసరంగా వృథా చేసిన ఓ హోటల్‌పై జలమండలి అధికారులు చర్యలు తీసుకున్నారు. హోటల్ ప్రాంగణాన్ని నీటితో శుభ్రం చేస్తూ.. వృథా చేస్తున్న విషయాన్ని జలమండలి ఎండీ కె. అశోక్ రెడ్డి గుర్తించారు. దీంతో అధికారులు హోటల్ యాజమాన్యానికి రూ. 20 వేల జరిమానా విధించి వసూలు చేశారు. నీటి వనరులను వృథా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
తెలంగాణ
నీటి దుర్వినియోగం.. చివరికి..!


