హైదరాబాద్: 28°C
తెలంగాణ

స్పెషల్ ఎడ్యుకేటర్ల నియామకానికి దరఖాస్తులు

ADB: జిల్లాలోని 21 మండలాల పరిధిలోని 20 పీఎం శ్రీ పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం ఒప్పంద ప్రాతిపదికన స్పెషల్ ఎడ్యుకేటర్ల నియామకానికి దరఖాస్తులు కోరుతున్నట్లు డీఈవో మాధవి బుధవారం తెలిపారు. అర్హత గల అభ్యర్థులు తమ ధ్రువీకరణ పత్రాలతో ఈనెల 10లోపు డీఈవో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గౌరవ వేతనం రూ.18500 ఉంటుందని పేర్కొన్నారు.