SRPT: అనంతారం నుంచి అనాజీపురం వెళ్లే రహదారి కంపచెట్లతో మూసుకుపోయింది. రోడ్డుకు ఇరువైపులా పెరిగిన ముళ్లపొదలతో మలుపుల్లో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. అనాజీపురం, దోసపహాడ్, జంగంపడిగె, నాగులపహాడ్, నారాయణగూడెం గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి కంపచెట్లను తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
తెలంగాణ
కంపచెట్లతో మూసుకుపోయిన రహదారి.. ప్రమాదాల ముప్పు


