హైదరాబాద్: 28°C
తెలంగాణ

కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలు: కలెక్టర్

BDK: గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని జిల్లాలోని పుష్కర ఘాట్ల వద్ద చేపట్టిన పనులను వేగవంతం చేసి సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష జరిపారు. కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.