హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు తెలంగాణ చౌరస్తాలో కాంగ్రెస్ నిరసన

MBNR: జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఇవాళ ఉదయం 11 గంటలకు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు డీసీసీ అధ్యక్షుడు సంజీవ్ ముదిరాజ్ తెలిపారు. ఏఐసీసీ ఇచ్చిన పిలుపుమేరకు భారత ప్రజాస్వామ్యానికి బ్లాక్ డే గా పరిగణిస్తూ ఈ నిరసన కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మరియు నాయకులు పెద్దఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.