MBNR: చారకొండ మండలం జూపల్లి సమీపంలో ఘోర ప్రమాదం తప్పింది. కర్ణాటక నుంచి కోల్‌కతాకు పత్తి లోడుతో వెళ్తున్న లారీకి గొర్రెలు అడ్డంగా రావడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదంలో పత్తి బస్తాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.
తెలంగాణ
గొర్రెలను తప్పించబోయి పత్తి లారీ బోల్తా


