హైదరాబాద్: 28°C
తెలంగాణ

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడులు

SRCL: వేములవాడ పట్టణంలోని జాతర గ్రౌండ్‌ ప్రాంతంలో పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. సీఐ నటేష్‌ ఆధ్వర్యంలో చేపట్టిన దాడుల్లో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు రూ.9 వేల నగదు, ఆరు ద్విచక్ర వాహనాలు, ఏడు మొబైల్‌ ఫోన్లు, పేక ముక్కలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు.