హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రెండు నెలల్లో 13 మంది ఆత్మహత్య

కోనసీమ: గోదావరి నదిపై ఉన్న వంతెనల నుంచి దూకి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కొవ్వూరు, చించినాడ వంతెనల నుంచి గోదావరిలోకి దూకిన వారి సంఖ్య ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లోనే ఎక్కువగా నమోదైంది. అక్టోబర్ ప్రారంభంలో రాజమండ్రి రోడ్డు కం రైల్వే బ్రిడ్జి నుంచి యువకుడు దుకాడు. రెండున్నర నెలల్లో దాదాపు 13 మంది ఇలా ప్రాణాలు కోల్పోయారు.