NLG: తిప్పర్తి–గంగన్నపాలెం రహదారిలోని చేతిపంపు మట్టిలో కూరుకుపోయి నిరుపయోగంగా మారింది. గతంలో కాలనీవాసులు, ప్రయాణికుల దాహం తీర్చిన పంపు ప్రస్తుతం తుప్పుపట్టి పాడవుతోంది. బోరులో నీరున్నా మరమ్మతులు చేయడం లేదని స్థానికులు వాపోతున్నారు. అధికారులు స్పందించి చేతిపంపును బాగుచేసి వినియోగంలోకి తేవాలని కోరుతున్నారు.
తెలంగాణ
చేతిపంపు ఇలా.. నీరు తాగేదెలా


