VKB: గిరిజన యువతీ యువకులు PC, SI ఉద్యోగాల కోసం అందిస్తున్న ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని గిరిజన అభివృద్ధి అధికారి జనార్ధన్ కోరారు. గిరిజన సంక్షేమ శాఖ సహకారంతో సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ మన్ననూర్ ఆధ్వర్యంలో ఈ నెల 15న పరీక్ష నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికైన వారికి ఈ నెల 21 నుంచి తరగతులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
తెలంగాణ
ఉచిత శిక్షణ సద్వినియోగం చేసుకోవాలి: DTDO


