MBNR: నవాబుపేట మండలం మైసమ్మ అడవి మూలమలుపు వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. కారు-ఆటో ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం సంభవించింది. ప్రమాదంతో కాకర్లపాడుకు చెందిన గొర్ల సరిత(36) అక్కడికక్కడే మృతి చెందారు. ఆటో డ్రైవర్ ఇమ్రాన్, కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడగా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. ఒకరు స్పాట్ డెడ్


