హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పైపులైన్ మరమ్మతులు పూర్తిచేయాలి'

PDPL: గోదావరిఖని రమేశ్‌నగర్ లాల్‌బహదూర్‌నగర్ ప్రధాన రహదారిలో తాగునీటి పైపులైన్ మరమ్మతుల కోసం వారం రోజుల క్రితం రోడ్డును తవ్వారు. వాహనాల రాకపోకలతో తవ్విన ప్రాంతం మళ్లీ పూడుకుపోయింది. పైపులైన్ కనిపించలేదని, మరింత లోతుగా తవ్వి లీకేజీని అరికడతామని సిబ్బంది చెప్పినా వారం రోజులుగా పనులు ముందుకు సాగలేదు. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు.