హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు: ఎస్పీ

VKB: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రతా చర్యలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమావేశం నిర్వహించారు. రోడ్డు భద్రతా చర్యలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలిసేలా అవగాహన కార్యక్రమాలను చేపట్టాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.