కాకినాడ: పెద్దాపురంలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బత్తిన చందు(11) కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. బైక్, స్కూటీ ఢీకొన్న ఘటనలో నూకేశ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందగా, చందుతో పాటు మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. పెద్దాపురం ఎస్ఐ పాపారావు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదం.. చికిత్స పొందుతూ బాలుడు మృతి


