WG: భీమవరం పట్టణంలోని శ్రీ మావుళ్లమ్మ ఆలయంలో ఈ నెల 11 నుంచి 20 వరకు శరన్నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఉత్సవాల బ్రోచరు ఆవిష్కరించారు. భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నట్లు సహాయ కమిషనర్ మహాలక్ష్మి నగేశ్ తెలిపారు. ఈ నెల 22న అన్నసమారాధన నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
మావుళ్లమ్మ ఆలయంలో 11 నుంచి శరన్నవరాత్రులు


