MDCL: బాలానగర్ ఎస్వీసీఐఈ కాలనీ ఫేజ్-2లో ప్రధాన రహదారి పక్కన విద్యుత్ నియంత్రిక ప్రమాదకరంగా మారింది. చుట్టూ కంచె లేకపోవడంతో పాటు కేబుళ్లు కిందకు వేలాడుతున్నాయి. నియంత్రిక పరిసరాలు పిచ్చిమొక్కలతో అధ్వానంగా మారాయి. అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. విద్యుత్ అధికారులు వెంటనే కంచె ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
ప్రమాదకరంగా మారిన నియంత్రిక..!


