హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈపూరు విద్యుత్ శాఖ ఏఈపై విజిలెన్స్ విచారణ

PLD: ఈపూరు విద్యుత్‌ శాఖ ఏఈ గాంధీబాబుపై వచ్చిన అవినీతి ఆరోపణలపై విజిలెన్స్‌ అధికారులు విచారణ చేపట్టారు. విద్యుత్‌ ప్రమాదాల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు మంజూరైన పరిహారం నుంచి మామూళ్లు వసూలు చేశారనే ఫిర్యాదులతో పాటు ట్రాన్స్‌ఫార్మర్ల మంజూరులో లంచం తీసుకున్నారనే ఆరోపణలపై విచారణ జరిగింది. విజిలెన్స్‌ అధికారులు పలు గ్రామాల్లో పర్యటించి విచారణ చేస్తున్నారు.