హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాల కార్మికులు కనిపిస్తే చర్యలే: ఎమ్మెల్యే

GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని కామాక్షి నగర్ మిర్చియార్డు పరిసరాల్లో బాల కార్మికులను పూర్తిస్థాయిలో నిర్మూలించాలని ఎమ్మెల్యే గళ్ళా మాధవి స్పష్టం చేశారు. మిర్చి గోడౌన్లు, పాకల్లో పిల్లలతో పని చేయిస్తే యజమానులు, మేస్త్రీలు, తల్లిదండ్రులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. పిల్లలు, మేస్త్రీలు, గోడౌన్ యజమానులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు.