హైదరాబాద్: 28°C
తెలంగాణ

మునగాల సీఐగా ప్రతాపలింగం బాధ్యతల స్వీకరణ

SRPT: మునగాల సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా కె. ప్రతాపలింగం బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సూర్యాపేట మల్టీజోన్‌-2 నుంచి ఆయన బదిలీపై వచ్చారు. ఇప్పటివరకు పనిచేసిన డి. రామకృష్ణారెడ్డిని కోదాడ రూరల్ సీఐగా బదిలీ చేస్తూ ఎస్పీ నరసింహ ఆదేశాలు జారీ చేశారు. మునగాల, మోతె, నడిగూడెం మండలాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తామని ప్రతాపలింగం తెలిపారు.