హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు మద్యం దుకాణాలు లాటరీ

విశాఖ జిల్లాలో మద్యం దుకాణాలకు ఇవాళ వీఎంఆర్డీఏ చిల్డ్రన్స్ ఎరీనాలో కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ తీయనున్నట్లు ఎక్సైజ్ డీసీ శ్రీరామచంద్రమూర్తి తెలిపారు. జిల్లాలో 52 దుకాణాలకు 47 దరఖాస్తులు వచ్చాయన్నారు. దరఖాస్తుల ద్వారా ప్రభుత్వానికి రూ.5.64 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. ఉదయం 8 గంటల నుంచి లాటరీ ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.