హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దేశాభివృద్ధి, సంక్షేమమే మోదీ లక్ష్యం: చమర్తి

ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ స్ఫూర్తిదాయకమని రాజంపేట TDP ఇన్‌చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు అన్నారు. బుధవారం రాజంపేట పార్టీ కార్యాలయం నుంచి NTR సర్కిల్ వరకు నిర్వహించిన ‘సేవా జ్యోతి యాత్ర’లో నాయకులతో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. దేశాభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు.