హైదరాబాద్: 28°C
తెలంగాణ

డిగ్రీ సెమిస్టర్ పరీక్షలకు షెడ్యూల్

NLG: ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం డిగ్రీ 3, 5వ సెమిస్టర్ రెగ్యులర్, బ్యాక్‌లాగ్ పరీక్షల షెడ్యూల్ బుధవారం రాత్రి విడుదలైంది. నవంబర్ 3 నుంచి 18 వరకు పరీక్షలు జరగనున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఉపేందర్ రెడ్డి తెలిపారు. విద్యార్థులు పరీక్షలకు సిద్ధం కావాలని సూచించారు..