హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కదిరిలో టీడీపీకి బిగ్ షాక్.. వైసీపీలో 70 కుటుంబాలు చేరిక

సత్యసాయి: కదిరిలోని 14వ వార్డుకు చెందిన మైనుద్దిన్ ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన 70 కుటుంబాలు వైసీపీలో చేరాయి. కదిరి నియోజకవర్గ సమన్వయకర్త బీఎస్ మక్బూల్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోవడంతోనే పార్టీ మారుతున్నట్లు చేరినవారు తెలిపారు. ఇటీవల టీడీపీలోకి వెళ్లిన పలువురు నాయకులు కూడా తిరిగి సొంత గూటికి చేరారని మక్బూల్ పేర్కొన్నారు.