హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు రాయితీపై శనగ విత్తనాల పంపిణీ

KMR: తాడ్వాయి మండలంలో యాసంగి శనగ విత్తనాల పంపిణీ గురువారం నుంచి ప్రారంభం కానుందని తాడ్వాయి మండల వ్యవసాయ అధికారి నర్సింహులు తెలిపారు. ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద 1,675 బస్తాలు కేటాయించగా, తొలి విడతగా 435 బస్తాలు మండల కేంద్రానికి చేరినట్లు ఆయన పేర్కొన్నారు. రైతులు ఈ రాయితీ విత్తనాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.