VSP: జిల్లా వైద్య, ఆరోగ్యశాఖకు చెందిన తొమ్మిది పాత ప్రభుత్వ వాహనాలను ఈనెల 15న ఈ-కొనుగోలు పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో వేలం వేయనున్నట్లు డీఎంహెచ్వో పి.జగదీశ్వరరావు తెలిపారు. ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వేలం ప్రక్రియ జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్నవారు konugolu.ap.gov.in పోర్టల్‌లో వివరాలు తెలుసుకోవచ్చని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 15న వాహనాలు వేలం పాట


