SRD: భ్రూణ లింగ నిర్ధారణ పరీక్షలకు పాల్పడే స్కానింగ్ కేంద్రాలపై కఠిన చర్యలు ఉంటాయని అడిషనల్ కలెక్టర్ పాండు హెచ్చరించారు. జిల్లాలో PCPNDT చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. నిబంధనలు పాటించే సెంటర్లకే రిజిస్ట్రేషన్లు ఇవ్వాలని, తప్పుదోవ పట్టించే కేంద్రాలను సీజ్ చేయాలన్నారు. రికార్డులను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించారు.
తెలంగాణ
అక్రమ స్కానింగ్ కేంద్రాలు సీజ్: అడిషనల్ కలెక్టర్


