CTR: జిల్లాలోని కార్వేటినగరం ప్రభుత్వ డైట్ కళాశాలలో ఈ నెల 23వ తేదీన రోల్ ప్లే, ఫోక్ డ్యాన్స్ ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్టు డీఈవో లక్ష్మీనారాయణ తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు పోటీలకు అర్హులని తెలిపారు. ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు డాన్స్ పోటీలు


