హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆటోను ఢీకొన్న జేసీబీ.. వ్యక్తి మృతి

అన్నమయ్య: సుండుపల్లి అగ్రహారం వద్ద బుధవారం రాత్రి ఆటో–జేసీబీ ఢీకొన్న ప్రమాదంలో తిమ్మసముద్రం హరిజనవాడకు చెందిన మల్లేపల్లి మనోహర్‌ (55) మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన ఆయనను రాయచోటి ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనతో తిమ్మసముద్రంలో విషాదఛాయలు అలుముకున్నాయి.